అందరూ తప్పనిసరిగా పాటించాల్సిన 5 Health Tips

0
health tips telugulo

ప్రతీ మనిషి కూడా ఎక్కువకాలం జీవించాలి అనుకుంటాడు. అలా ఎక్కువకాలం జీవించాలి అంటే ముందు మన ఆరోగ్యం బావుండాలి. అయితే ఆరోగ్యంగా ఉండటం అంటే ఏ జబ్బు రాకుండా ఉండటం మాత్రమే కాదు. శారీరకంగా (Physically), మానసికంగా (Mentally), సామాజికంగా (Socially well being) బావున్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పవచ్చు అన్నమాట. వాటిల్లో ఏఒక్కటీ సరిగా లేకపోయినా మనం ఆరోగ్యంగా లేనట్లే.

ఒకప్పుడు మనుషుల జీవితకాలం (Life span) 100 సంవత్సరాలు ఉండేది మరి ఇప్పుడు 65 సంవత్సరాలకు పడిపోయింది. కారణం అప్పటి ఆహారపు అలవాట్లు కావచ్చు, కాలుష్య రహిత వాతావరణం కావచ్చు.

కాబట్టి మనం ఎక్కువ కాలం జీవించాలి అంటే మన ఆరోగ్యం (Health) మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనావుంది అందుకే కొన్నినా Health tips పాటించాలి రోజు.

5 Health Tips మీకోసం

health tips telugulo

 

మనం ఆరోగ్యంగా ఉండటం వలన మన Career life, Personal life, Social life ఇవన్నీ చాలా ఆనందంగా ఉంటాయి.

మంచి శారీరక దృఢత్వం (Physical fitness) మంచిగా ఉండటం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది, ఏకాగ్రత (Concentration) పెరుగుతుంది, జ్ఞాపకశక్తి (Memory power) పెరుగుతుంది, మరియు Confidence పెరుగుతుంది.

అయితే మంచి శారీరక దృఢత్వం కోసం రోజూ వ్యాయామం (Exercise), యోగా, మంచి ఆహారపు అలవాట్లు అలవాటు చేసుకోవాలి. యోగా వలన మంచి ఆలోచనా శక్తి (Positive thinking) అలవాటు అవుతుంది. జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి.

ఇక సామాజిక సంబంధాలు (Social wealth) మెరుగు పరుచుకోవాలి. ఇతరులతో బాగా మెలగాలి. ఇవన్నీ బావున్నప్పుడు ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యగా ఉన్నట్లు అన్నమాట.

క్రింద కొన్ని తప్పనిసరిగా పాటించేసిన Health Tips మీ కోసం. ఇవి కనుక మీరు పాటించాట్లు అయితే మీ ఆరోగ్యం కొంత వరుకు Good గా వుంటుంది

శారీరక సామర్ధ్యం (Physical fitness)

physical fitness

మనం ఆరోగ్యంగా ఉండటానికి శారీరక సామర్థ్యం ఎంతో ఉపయోగం. ప్రతీరోజు వ్యాయామం చేయడం వల్ల కండరాలు మరియు ఎముకలు (bones) దృడంగా ఉంటాయి. శారీరక సామర్ధ్యం వల్ల బరువుని,రక్తపోటును అదుపులో వుంచుకోవచ్చు.

గుండెపోటు (heart attack) నుంచి కాపాడుతుంది. Physical fitness వల్ల మధుమేహాన్ని(డయాబెటిస్), కొన్నిరకాల క్యాన్సర్లను కూడా రాకుండా కాపాడుకోవచ్చు.

పాజిటివ్ థింకింగ్

positive thinking

మనం ఆరోగ్యంగా ఉండటానికి పాజిటివ్ థింకింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. పాజిటివ్ థింకింగ్ వలన ఒత్తిడి (stress) అదుపులో ఉంటుంది. ఆత్మన్యూనతా భావం తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధులు అదుపులో ఉంటాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

సామాజిక సంబంధాలు (Social wealth)

social wealth

మనం రోజూ మాట్లాడే వ్యక్తులు, ఇంటర్నెట్లోగాని,ఫోన్ ద్వారా మాట్లాడే వ్యక్తులు గానీ సామాజిక సంబంధాల కిందకు వస్తాయి. ఇంకా మన కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు, సహోద్యో గులు మొదలైనవి సామాజిక సంబంధాలలోకి వస్తాయి. అందరితో మంచిగా మెలగటం మంచిది.

నిద్ర (Sleep)

sleep

వీలైనంత ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మంచి నిద్ర వలన ఒత్తిడి తక్కువగా ఉంటుంది, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లు అదుపులో ఉంటాయి. డిప్రెషన్ ని తగ్గిస్తుంది.

మంచి ఆహారం (Food)

good food

మంచి పోషకాహారం కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల Healthy గా ఉండచ్చు. జంక్ ఫుడ్స్ వంటి వాటి జోలికి వెళ్ళకూడదు. మంచి ఆహారం తీస్కోవటం వలన మధుమేహం, ఊబకాయం, కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.

పైన తెలిపిన జాగ్రత్తలు పాటించటంవలన మనం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందగలము.

మరిన్ని ఇలాంటి Health Tips కోసం మా తెలుగులో ని visit చేయండి మరియు follow చేయండి Facebook లో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here