ఫేస్ బుక్ లో పవన్ కళ్యాణ్ ఆఫీషియల్ పేజీ స్టార్ట్

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటినుంచే ప్రజలతో మమేకం అవటానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమం అయిన ట్విట్టర్ లో ఉన్న ఆయన ఇప్పుడు అత్యంత ప్రజాదరణ కలిగిన ఫేస్ బుక్ లో ఒక ఆఫీసషియల్ పేజీని కూడా స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియపరిచారు. ఆయన ఎప్పుడూ ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి ఆరాట పడుతుంటారు. అందువల్ల ఇటువంటి ఫేస్ బుక్ పేజీ వల్ల మరింత దగ్గర కావచ్చని, ప్రజా సమస్యలు తెలుసుకోవచ్చని, సామాన్యులకు కూడా మరింత చేరువ కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీనితో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఇది మాత్రమే కాకుండా జనసేన పార్టీ సిద్దాంతాలు, పార్టీ కార్యక్రమాలు, మేనిఫెస్టో ఎప్పటికప్పుడు తెలియ జేసేందుకు ఈ ఫేస్ బుక్ పేజీ మొదలు పెట్టడానికి అసలు కారణం.

pawan kalyan

మొదట పోస్ట్ చేసిన అంశం ఏంటంటే

పవన్ కళ్యాణ్ మొదటగా తాను నవంబర్ 2 నుంచి రైలు యాత్ర చేయనున్నట్లు తెలిపారు. ఆ రైలు యాత్ర విజయవాడ నుంచి తుని వరకు అని ప్రకటించారు. ఇప్పటికే ఈ యాత్రకి సంబందించిన ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయని ఆయన తెలియజేసారు. ప్రజా సమస్యలను రైలులోనే చర్చించటం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం.

మరి ఈ యాత్ర వలన ప్రజలతో ఎలా మమేకం అవుతారో, ఇంకా అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మరి ఆ అభిమాన సంద్రాన్ని ఎలా అదుపు చేస్తారో చూడాలి. ఇంకా రైలు ప్రయాణం కాబట్టి అభిమానులు అత్యుత్సాహం వల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.

ఏదైతేనేమి ఈ రైలు యాత్ర దిగ్విజయంగా జరగాలి అని కోరుకుండాము. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా తెలుగులో సైట్ ని సందర్శించండి.

Leave a Comment