కాలుష్యంలో భారత దేశం (Story of Polluted India)

0
polluted india

ప్రపంచంలో 10 అతి ఎక్కువ కాలుష్య నగరాలు ఢిల్లీ, ఫరిధబడ్, గయ, వారణాసి, పాట్నా, కాన్పూర్, లక్నో, ఆగ్రా, గుర్గోవాన్, బమెడ. ఈ పది నగరాల్లో 9 భారతదేశంలోనే ఉన్నాయి.

పర్యావరణ పరిరక్షణ నివేదిక 2018 (environmental performance index) ప్రకారం 180 దేశాలలో భారత దేశం 177 స్థానం లో ఉంది.

మనం పీల్చే గాలి యుక్క నాణ్యతను Air quality index reports ఆధారం చేసుకుని తెలుసుకోవచ్చు.

గాలి నాణ్యత

  • 0-50 మధ్య వస్తే బాగుంది అని అర్థం
  • 51-100 మధ్య వస్తే సంతృప్తికరంగా ఉంది అని అర్థం,
  • 101-200 మధ్య వస్తే మోస్తరు అని అర్థం,
  • 201-300 మధ్య వస్తే తక్కువ అని అర్థం
  • 301-400 మధ్య వస్తే ప్రమాదకరం అని అర్థం,
  • 401-500 మధ్య వస్తే అతి ప్రమాదకరం అని అర్థం,

అలాంటిది ఢిల్లీలో 900 వరకు నమోదు అయ్యాయి, ఢిల్లీ లో మాస్క్ లేకుండా బయటకి వెళ్తే మనం పీల్చే గాలి 45 సిగరెట్స్ కాల్చడంతో సమానం, ఇంట్లో పీల్చే గాలి 10 సిగరెట్స్ కల్చడంతో సమానం, ఢిల్లీలో గాలి కాలుష్యం అనేది లేకపోతే అక్కడ నివసించే ఒక్కో వ్యక్తి 9 సంవత్సరాలు ఎక్కువ బతికే అవకాశం ఉంది, అక్కడ కాలుష్యం ప్రధాన కారణాలు హర్యానా, పంజాబ్ రాష్ట్రంలో పంటలను తగలబెట్టడం మరియు కోటికి పైగా వాహనాలు నుంచి వచ్చే పొగ.

ఢిల్లీ విషయం కాసేపు పక్కన పెడితే మన తెలుగు రాష్ట్రాలు లో గాలి నాణ్యత మోస్తరుగా ఉంది, దీనివల్ల తక్షణం ప్రమాదం లేకపోయినా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది..

అసలు భారత దేశంలో కాలుష్యానికి కారణం ఎవరు?

శిలాజ ఇంధనాలు ( బొగ్గు, పెట్రోల్) కాల్చడం వల్ల carbon dioxide, methane, nitrous oxide లాంటివి గాలిలోకి విడుదల అవుతాయి. దీనికి తోడు వాహనాల నుంచి వచ్చే carbon monoxide, పరిశ్రమలు నుంచి వచ్చే hydro carbons మరియ carbon monoxide శుద్ధి చెయ్యకుండా విడుదల చేయడం వల్ల, Ac & fridges నుంచి వచ్చే hydro flouro carbons ద్వారా ఓజోన్ పొరకు నష్టం జరుగుతుంది. దీని వల్ల సూర్యుడు నుంచి వచ్చే హానికరమైన కిరణాలు భూమిని తాకి మనకి చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

నీటి కాలుష్యము

మనం ఉపయోగించిన నీటిని కాలువ ద్వారా నదులలోకి వదిలి, మళ్లీ అదే నీటిని తాగడం కోసం, వ్యవసాయం కోసం ఉపయోగించి దాని ద్వారా సముద్రాలకి వదలడం ద్వారా ఎన్నో అరుదైన చేపలు ఇప్పటికే అంతరించిపోయాయి, దీనికి తోడు కర్మాగారాలు నుంచి వచ్చే కలుషిత నీరు సముద్రాలోకి కలవడం వల్ల నీటి కాలుష్యం అనేది జరుగుతుంది..

గంగానది సాధారణంగా కన్న 2800 సార్లు ఎక్కువ కలుషితం అయ్యింది, దీనికి తోడు మనం చేసే పూజలు వల్ల ఇంకా ఎక్కువ కలుషితం అవుతుంది.

2050 కి సముద్రంలో ఉన్న చేపలు బరువు కన్న ప్లాస్టిక్ బరువు ఎక్కువ ఉంటుంది అని ఒక సర్వే చెబుతుంది.

నీటి కాలుష్యము అదుపు చెయ్యాలి అంటే విభాగాలు ప్రకారం waste water treatment plants, muncipal waste water treatment plants, industrial waste శుద్ధి చేసే ప్లాంట్స్ ఉండాలి, ఇవి ఉంటే సరిపోదు సమర్థవంతంగా పని చెయ్యాలి, అలా చెయ్యాలి అంటే చట్టాలు బలంగా ఉండాలి.

ఇక్కడ కనిపించేవి ఆస్ట్రేలియాలో శుద్ధి చెయ్యడానికి ఉపయోగించేది, ఇలాంటివి ఉపయోగించాలి, ఇవి జపాన్లో ఉండే డ్రైనేజీలు నీరుని నీరులగా, నదిని నదిలగా చూసే వాళ్ళకి కాలుష్యం అనేది తక్కువ ఉంది, కాని మనకి మాత్రం చాలా ఎక్కువ ఎంత ఎక్కువ అంటే గంగా నది ప్రపంచలో రెండో అతి పెద్ద కలుషిత నది అయ్యే అంత..

ప్లాస్టిక్ కాలుష్యం

మనం ఉపయోగించే polythene covers భూమిలోకి కలవడానికి 1000 సంవత్సరాలు వరకు పడుతుంది, ప్లాస్టిక్ బాటిల్స్ కలవడానికి 450 సంవత్సరాలు వరకు పడుతుంది,

సంవత్సరానికి ప్రపంచవయాప్తంగా 38 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త రూపంలో బయటికి వస్తుంది, అందులో 9% మాత్రమే రీసైకిల్ అవుతుంది, మిగతాది భూమిలోకి కలవడానికి దగ్గరదగ్గర కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది, అదే ప్లాస్టిక్ తిని సముద్రంలో చేపలు బయట జంతువులు మరణించడం జరుగుతుంది..

2020 భారతదేశంలో ప్రతి రోజు లక్ష టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంది, ఆ చెత్తని సమర్థవంతంగా రీసైకిల్ చెయ్యకపోతే కొత్తగా 30,000 ఎకరాలు చెత్త వెయ్యడానికి కావాలి, ఆ 30,000 ఎకరాల్లో ఎన్ని స్కూల్స్, హాస్పిటల్స్ కట్టచో ఆలోచించండి..

కాలుష్యం వల్ల మనుషులకి వచ్చే ప్రమాదం?

గొంతు సంబంధిత వ్యాధులు, కంటి సంబంధిత వ్యాధులు, గుండెలో అర్ట్రీస్ బ్లాక్ అయ్యి గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ, ఊపిరి సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, శరీరంలో టెస్టోస్టెరోన్ మరియు ఈస్ట్రోజెన్ లెవెల్స్ తక్కువ అయ్యి పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.

మనల్ని మనమే చంపుకుంటున్నం..

ఒక చెట్టు సంవత్సరానికి 260 పౌండ్ల ఆక్సిజన్ ఇస్తుంది,ఒక ఎకరంలో ఉన్న చెట్లు 2.6 టన్నుల కార్బన్ దీఆక్సిడేని తగ్గిస్తుంది, ఒక చెట్టు 18 మందికి సంవత్సరం మొత్తం ఆక్సిజన్ అందజేస్తుంది, చెట్ల వేడి తగ్గుతుంది, వర్షాలు పడతాయి, గ్లోబల్ వార్మింగ్ తగ్గింది అలాంటిది ప్రతి సంవత్సరం భారతదేశంలో కొన్ని లక్షల చెట్లని నరికేస్తున్నం, కొన్ని సంవత్సరాలు తరవాత భూమి మీద ఉన్న కాలుష్యం తగ్గించడానికి సరిపడే చెట్లు నాటడనికి భూమి సరిపోదు ఏమో!

పర్యావరణ పరిరక్షణ దేశాలు

పర్యావరణ పరిరక్షణ నివేదికలో అగ్ర స్థానంలో దేశాలలో పర్యావరణ రక్షణ చట్టాలు చాలా లో కటిణంగా ఉంటాయి.

Finland లో ప్రకృతిని కాపాడడం చాలా గర్వంగా భావిస్తారు, వాళ్ళు దేశం లో 60% విద్యుచ్ఛక్తిని పునరుత్పాదక శక్తి ద్వారా తయారుచేస్తారు..

Iceland లో 85% శక్తిని పునరుత్పాదక శక్తి ద్వారా తయారు చేస్తారు..

sweden మంచి నీటి మరియు అందరికీ నీరు అందుబాటులో ఉండే విషయంలో మంచి స్థానంలో ఉంది, అక్కడ ఉన్న చెత్తని 99% రీసైకిల్ చేస్తున్నారు, దీనితో పాటు ప్రతి సంవత్సరం వాళ్ళు కొన్ని టన్నుల చెత్తని దిగుమతి చేసుకుంటున్నారు..

పర్యావరణ పరిరక్షణ దేశాలు

ప్రకృతిని కాపాడాలి అంటే మనం ఏం చెయ్యాలి?

కాలుష్యం తగ్గాలి అంటే మనం ప్రకృతిని ప్రేమించాలి, దేశం బాగుండాలి అని కోరుకోవాలి, చేసే పని మీద అవగాహన ఉండాలి, ప్లాస్టిక్ వాడకం తగ్గించి, చెట్లు నాటడం పెంచి, వీలు అయినంత వరకు ప్రభుత్వ రవాణా వ్యవస్థ ఉపయోగించాలి, ఇలాంటివి చేస్తే కాలుష్యం కచ్చితంగా తగ్గుతుంది..

Also, Read: ఆరోగ్యమైన గుండె కోసం ఈ 10 Tips పాటించాలి ప్రతిఒక్కరూ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here