ఆరోగ్యమైన గుండె కోసం ఈ 10 Tips పాటించాలి ప్రతిఒక్కరూ

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం గుండె. మరి అలాంటి గుండెని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం గుండెకు సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీస్కుంటున్నామా? ప్రపంచంలో అధిక మరణాలు గుండె సంబంధిత వ్యాధులకు కారణంగానే అని కొన్ని సర్వేలు చెపుతున్నాయి.

గత సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు ఇంకా ఎక్కువగా గుండెజబ్బులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు గుండెపోటు (Heart Attack) 60లు దాటాక వచ్చేవి కానీ ఇప్పుడు ఆశ్చర్యంగా ఇరవై, పాతిక సంవత్సరాల వయస్సు వాళ్లకు కూడా వస్తున్నాయి. గుండెపోటుకు ముఖ్యకారణం ఏంటంటే రక్తసరఫరాకు అవరోధం ఏర్పడటం.

ఇతర జబ్బులతో పోలిస్తే గుండెజబ్బులు బాగా ఎక్కువైన తరువాతే తెలుస్తుంది. కాబట్టి మనము ముందుగానే కొన్ని సూచనలు పాటించటం వలన వాటినుండి బయటపడే అవకాశం ఉంది.

ఆ సూచనలు ఏంటంటే.

healthy heart tips telugulo

1. పొగత్రాగటం మానేయాలి

మీరు పొగ త్రాగుతున్నట్లైతే వెంటనే మానేయండి. పొగ త్రాగటం ఒక్కటి మానేస్తే మన గుండెని చాలా వరకు కాపాడుకున్నట్లే. గుండెపోటుకు కారణం ఎక్కువగా పొగత్రాగటం వలనే. మీరు ఒక సంవత్సరం ధూమపానం మానేయడం వలన మనకు వచ్చే గుండె జబ్బులను సగం తగ్గించుకున్నట్లే.

2. కొవ్వు పదార్థాలు తినటం తగ్గించాలి

ఎక్కువ కొవ్వు పదార్థాలు తీస్కోవటం వల్ల మన రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. దానివల్ల కొవ్వు పెరిగిపోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కొవ్వు శాతం ఎక్కువగా ఉండే పదార్థాలు వెన్న, అవకాడో పండు (దీనిలో 77 శాతం కొవ్వు ఉంటుంది), డార్క్ చాకోలేట్ (కొవ్వు 65%), కొవ్వు పట్టిన చేపలు, కొన్ని రకాల వంట నూనెలు, కొబ్బరికాయ, కొబ్బరినూనె, పామ్ ఆయిల్ మొ. వాటిలో కొవ్వు అధికంగా ఉంటది. ఇంకా ఆవు మాంసం, ఐస్ క్రీమ్ లలో కూడా ఎక్కువ కొవ్వు ఉంటుంది. కాబట్టి వాటిని తగించుకుంటే మంచిది.

3. ఉప్పు తగ్గించాలి

గుండెపోటు రావటానికి ముఖ్యకారణం రక్తపోటు (Blood pressure). మనం తినే ఆహారంలో ఎక్కువ ఉప్పు వాడటం వల్ల బి.పి పెరుగుతుంది. వీలైనంత వరకు ఉప్పు తక్కువగా వాడటం మంచిది. యుక్తవయస్కులు రోజుకు 6గ్రాములకంటే ఎక్కువ తినకూడదు. అంటే ఇక టేబుల్ స్పూన్ అన్నమాట.

4. మద్యపానం తగ్గించాలి

ఆల్కహాల్ లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. రోజూ మద్యపానం చేయటం వల్ల మన శరీరంలో అవి అధికం అవ్వి గుండెపోటుకు దారి తీయొచ్చు.

5. పీచుపదార్థాలు తీసుకోవాలి

ప్రతీరోజూ ఒక 30 గ్రాముల పీచుపదార్థాలు తీసుకోవటం వలన గుండకు చాలా మంచిది. పీచుపదార్థాలు ధాన్యంలో, ఓట్స్, బార్లీ గింజలు, కొన్ని విత్తనాలు, గింజలు మొదలయినవి. ఇంకా బంగాళాదుంపలను తొక్కతో పాటుగా ఆహారంలో తీసుక్కోవాలి.

6. అధిక బరువును తగ్గించుకోవాలి

అధిక బరువు వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువ.కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల రక్తప్రసరణ సరిగా ఉండదు.వీలైనంత వరకు బరువు తగ్గించుకోవడం మంచిది. రోజూ వ్యాయామం చేయాలి.

రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. దానివల్ల బి.పి (రక్తప్రసరణ) బాగా జరుగుతుంది. తద్వారా గుండెకు చాలా మంచిది.

7. చేపలు తినాలి

చేపలు ఆహారంగా తీసుకోవటం గుండెకు మంచిది, అధిక కొవ్వు వుండే చేపలు తప్ప. వాటిలో ఒమేగా-3 ఫాటీ ఆమ్లాలు ఉంటాయి. అవి గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది.

8. ఉత్సాహంగా ఉండటం

రోజంతా ఉత్సాహంగా ఉండటం గుండెకు ఎంతో మంచిది. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండటం చాలా అవసరం. ఒత్తిడి కారణంగా బి.పి లో తేడా వస్తుంది. ఆందోళనగా వుండకూడదు. ఇంకా వ్యాయామం చేయడంవల్ల రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు.

9. రోజూ పండ్లు తినాలి

రోజూ కనీసం 5 రకాల పండ్లు తినాలి. నేరేడు, చెర్రీ, అరటి, నిమ్మ కమలాపండు మొదలైన పీచు వుండే పండ్లు తినడం మంచిది. ఇంకా దానిమ్మ పండులో యాంటీ-అకీడెంట్లు ఎక్కువ. దానివల్ల రక్తప్రసరణ బాగా మెరుగుపడుతుంది. కర్భుజా పండు కూడా గుండెకు మంచిది.

10. ఇంకా మంచి నిద్ర

మంచి నిద్ర (Sleep) నిద్రకు సంబంధించిన కొన్ని జాగ్రత్తలతో గుండెపోటును ఎలా నివారించవచ్చో చూద్దాం. అలా అని అతినిద్ర చాలా ప్రమాదకరం. కానీ ప్రశాంతంగా నిద్రపోవడం చాలా మంచిది.

మధ్యాహ్నం పూట భోజనము చేసిన తరువాత ఓ చిన్న కునుకు తీయటం వల్ల మన సామర్ధ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తక్కువగా నిద్రపోయేవాళ్లకు రక్తపోటు పెరిగే అవకాశం ఉంది ఎక్కువ నిద్రపోయేవాళ్ళతో పోలిస్తే.

ఈ పై సూత్రాలవల్ల గుండెపోటు (Heart Attack) రాకుండా చూసుకోవచ్చు. గుండెపోటు వచ్చాక మనం చేసేది ఏముండదు. అందుకే రాకముందే తగిన జాగ్రత్తలు పాటించటం మంచిది.

మరిన్ని ఇలాంటి Health Tips కోసం మా తెలుగులో ని visit చేయండి మరియు మా Facebook పేజీని ఫాలో అవండి.

Leave a Comment