కొత్త సినిమా కబుర్లూ (Latest Updates) November 2018

updates

1.రోబో 2.0

సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ముఖ్యపాత్రల్లో నటించిన 2.ఓ సినిమాపై ఇటీవలే రిలీజ్ అయిన టీజర్ అంచనాలను భారీగా పెంచేసింది. అయితే చిత్ర యూనిట్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నవంబర్ 3వ తేదీన చెన్నైలో గ్రాండ్ గా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా అత్యంత భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 29 న భారీ స్థాయిలో విడుదల కానుంది.

2.ఎఫ్2 టీమ్ నుంచి ఫ్యాన్స్ కి దీపావళి గిఫ్ట్

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరూ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2 ( “ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్” అనేది ఉపశీర్షిక ). అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర యూనిట్ థాయిలాండ్ లో 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో వెంకీ సరసన తమన్నా మరియు వరుణ్ సరసన మెహరీన్ నటించనున్నారు. అయితే ఈ చిత్రం నుంచి ఫాన్స్ కి దీపావళి గిఫ్ట్ ఇవ్వనున్నారు. అదేంటంటే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ని నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ చిత్రం మాత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. కాగా ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

3.”సర్కార్” వివాదం ముగిసింది

ఇళయదళపతి విజయ్, ఏ.ఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “సర్కార్“. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే వివాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ చిత్రం తను రాదుకున్న కధ అను రచయిత వరుణ్ రాజేంద్రన్ మద్రాస్ హైకోర్టులో కేసు పెట్టారు. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాత చిత్ర టైటిల్ పై ఆ రచయిత పేరు వేస్తామని నిర్మాత హామీ ఇవ్వడంతో హైకోర్టు తీర్పు రాకముందే వివాదం సద్దుమణిగింది.

4.”ఆర్ఆర్ఆర్” లేటెస్ట్ అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో అగ్ర దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ (వర్కింగ్ టైటిల్ ) అనే మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని తెలిసిందే.ఈ చిత్రం అధికారకంగా వచ్చే నెల 5న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. అదే రోజు రాజమౌళి ఈచిత్రం ఏ నేపథ్యంలో సాగుతుందో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక ఈ చిత్రం యొక్క రెగ్యూలర్ షూటింగ్ నవంబర్ 18నుండి ప్రారంభం కానుంది. ఇందులో ముగ్గురు నాయికలు ఉంటారని సమచారం.

5.రాజశేఖర్ ‘కల్కి’ చిత్రం నుంచి లేటెస్ట్ అప్డేట్

టాలీవుడ్ యాంగ్రీ యుంగ్ మ్యాన్ డా.రాజశేఖర్, ఆ! వంటి విలక్షణ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘కల్కి’. ఇక అసలు మ్యాట‌ర్ ఏంటంటే.. 1980 నాటి క‌థ‌, పీరియాడిక్ నేప‌ధ్యం డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బెంగుళూరు బ్యూటీ నందిత స్వేత కీల‌క పాత్ర‌లో నటిస్తుంద‌ని కొద్ది రోజుల క్రితం వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా క‌ల్కి చిత్రంలో రాజ‌శేఖ‌ర్ స‌ర‌స‌న ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల‌ను ఓకే చేశార‌ని స‌మాచారం. అందులో ఒక‌రు హార్ట్ ఎటాక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అదా శ‌ర్మ కాగా, మ‌రొక‌రు బాహుబ‌లి-ది బిగినింగ్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో అందాలు ఆర‌బోసిన స్కార్‌లెట్ విల్స‌న్. ఈ ఇద్ద‌రు భామ‌లు క‌ల్కి చిత్రంలో భాగ‌మ‌య్యార‌ని తెలుస్తోంది. ఇక ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో పీరియడ్ సినిమాల ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. మ‌రి రాజశేఖర్‌కు క‌ల్కి చిత్రం ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుందో చూడాలి.

6.కాంట్రవర్సీ పోస్టర్ పై పెదవి విప్పిన శ్రీ విష్ణు

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు లతో నూతన దర్శకుడు ఇంద్రసేన కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘వీరభోగ వసంత రాయలు’. అయితే ఈ చిత్రానికి పూర్ రేటింగ్స్ రావటంతో హర్ట్ అయిన దర్శకుడు ఒక కాంట్రవర్సీ పోస్టర్ రేలీజ్ చేసాడు. తాజాగా ఈ వివాదాస్పద స్టేట్మెంట్ ఫై హీరో శ్రీ విష్ణు స్పందించారు. ఆ దర్శకుడితో కానీ చిత్ర నిర్మాతలతో కానీ నేను టచ్లో లేను. ఈ వివాదం తో నాకు ఎలాంటి సంభందం లేదు. రివ్యూవర్స్ అంటే నాకు ఎప్పుడే గౌరవమే వారిని నేను సపోర్ట్ చేస్తానని ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

మరిన్ని కొత్త సినిమా అప్డేట్స్ కోసం మా తెలుగులో సైట్ ని సందర్శించండి.

Leave a Comment