తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ 1520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25 నుంచి ప్రారంభంకానుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.
TS MHSRB మల్టీ-పర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ (ఫిమేల్) ప్రకటన వివరాలు
సంస్థ పేరు | మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, తెలంగాణ (TS MHSRB) |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ లో |
ఉద్యోగాల వివరాలు | బహుళ ప్రయోజన ఆరోగ్య సహాయకులు (మహిళ) |
ఖాళీల సంఖ్య | 1520 |
ఉద్యోగ విభాగం | తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ ద్వారా |
ఆఖరు తేదీ | 19.09.2023 |
అధికారిక వెబ్సైట్ | mhsrb.telangana.gov.in |
ఈ మల్టీ-పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు (స్త్రీ) ఉద్యోగాలకు సంబంధించిన ఇతర వివరాలు
విద్యార్హత:
మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సులో ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ రాష్ట్ర నర్సులు, మిడ్‌వైవ్స్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకొని ఉండాలి. (లేదా) ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్(మహిళ) శిక్షణా కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు/పరీక్ష ఫీజు:
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ & తెలంగాణ రాష్ట్ర ఎక్స్-సర్వీసెమెన్ ఉద్యోగులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
వయోపరిమితి
దరఖాస్తులను చేసుకునేవారి వయసు కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 44 సంవత్సరాలు మించకూడదు. వయస్సు 01/07/2023 నాటికి లెక్కించబడుతుంది . వయోపరిమితుల్లో సడలింపుల సమాచారం క్రింద ఇవ్వబడిన లింక్ లోని అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు
ఎంపిక విధానం
రాత పరీక్ష, పని అనుభవం తదితరాల ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది. పరీక్ష ఓఎంఆర్ ఆధారిత లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష. పరీక్ష ఆంగ్లంలో జరుగుతుంది.
అర్హత ఆసక్తి గల అభ్యర్ధులు క్రింద చెప్పబడిన లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దీనికోసం mhsrb.telangana.gov.in లోగానీ క్రింద తెలిపిన లింకులో గానీ 19.09.2023 తేదీలోగా అప్లికేషన్లు పంపవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 25.08.2023
దరఖాస్తుకు చివరి తేదీ: 19.09.2023
ముఖ్యమైన లింకులు:
TS MHSRB నోటిఫికేషన్ కొరకు క్లిక్ చేయండి
మల్టీ-పర్పస్ హెల్త్ అసిస్టెంట్స్ (స్త్రీ)లకు దరఖాస్తు చేసుకోడానికి క్లిక్ చేయండి