తెలంగాణలో ఇంటర్‌మీడియట్ సప్లిమెంటరీ ఫలితాల విడుదలకు రంగం సిద్దమైంది. ఫలితాలు జులై 7 లోగా విడుదల చేయనున్నట్లు బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి ఏర్పాట్లు పూర్తీ అయ్యాయి .జూన్ 12 నుంచి 20 వరకు జరిగిన సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా ఫస్టియర్, సెకండియర్‌కి కలిపి మొత్తం 4,12,325 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీళ్ళలో ఫస్టియర్‌కి 2,70,583 మంది, సెకండియర్‌కి 1,41,742 మంది విద్యార్థులు మొత్తం 933 పరీక్షాకేంద్రాల్లో ఈ పరీక్షలు రాసారు.
ఇకపోతే, ఇంటర్ రెగ్యులర్ పరీక్షలకు ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తంగా 9,48,153 మంది విద్యార్ధులు హాజరు కాగా ఫలితాలు ఏప్రిల్ 26 న విడుదల అయ్యాయి. దీనిలో ఫస్టియర్‌లో 63.85 శాతం ఉత్తీర్ణత, సెకండియర్ 67.26 శాతం ఉత్తీర్ణతతో ఫస్టియర్‌లో బాలురు 54.66 శాతం, బాలికలు 68.68% ఉత్తీర్ణులయ్యారు. అలాగే సెకండియర్‌లో బాలురు 55.60% ఉత్తీర్ణులైతే, బాలికలు 71.57 శాతం పాస్ కాగలిగారు.
ఇంటర్మీడియేట్ బోర్డు కూడా రేపో, ఎల్లుండో ఫలితాలు పక్కాగా రిలీజ్ చేసేందుకు సనాహాలు చేస్తున్నట్లు సమాచారం.