NDA పక్షాల సమావేశానికి జనసేన: టిడిపి కూడా ?

ఈనెల 18వ తేదీన  ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరు కానున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా వెల్లడించింది. ఈ సమావేశానికి పవన్ కల్యాణ్ తో పాటూ ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్ కూడా వెళ్లనున్నారని పార్టీ తెలిపింది. ఈ ఇద్దరు నేతలు ఈనెల 17న సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారని పార్టీ పేర్కొంది.

ఇదిలా ఉంటే, మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు విశ్వాసనీయ సమాచారం. గతంలో ఎన్డీఏను వీడిన ఇతర పార్టీలకు కూడా ఆహ్వానం అందించాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అలా జరిగితే ఎస్ఏడీ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్, చంద్ర బాబులకు కూడా ఆహ్వానం పంపాలని బిజెపి అధినాయకత్వం భావిస్తోంది.

ఇటీవల చంద్రబాబు అమిత్ షా తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఇది బాబు పట్ల బిజెపికి సానుకూల వైఖరి తెచ్చింది అని చెపుతున్నారు.  ఇదే జరిగితే తమను కూడా పిలవాలని ఎదురుచూస్తున్న బాబు ఆశ నెరవేరినట్లే . 

Leave a Comment