ITBP Recruitment 2023: 458 డ్రైవర్ కానిస్టేబుల్ నియామకాలకు జూలై 26 లోగా అప్లై చేయండి

ITBP రిక్రూట్‌మెంట్ | సెంట్రల్ నోటిఫికేషన్ 2023 :ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) డ్రైవర్ కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 458 డ్రైవర్ కానిస్టేబుల్ నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 27 జూన్ 2023 నుంచి ప్రారంభించబడింది. 26 జూలై 2023 దరఖాస్తులకు చివరితేదీ. అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, డ్రైవింగ్ టెస్ట్ మరియు చివరి దశ మెడికల్ ఎగ్జామినేషన్. ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల పూర్తి వివరాలకు itbpolice.nic.in చూడొచ్చు.

ITBP డ్రైవర్ కానిస్టేబుల్ ప్రకటన వివరాలు

సంస్థ పేరు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP)
ఉద్యోగ ప్రదేశం భారతదేశం అంతటా
ఉద్యోగాల వివరాలు డ్రైవర్ కానిస్టేబుల్
ఖాళీల సంఖ్య 458
ఉద్యోగ విభాగం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం ఆన్‌లైన్ ద్వారా
ఆఖరు తేదీ 26 జూలై 2023
అధికారిక వెబ్సైట్ itbpolice.nic.in

ఈ డ్రైవర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర వివరాలు

విద్యార్హత:

డ్రైవర్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునేవారు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ / యూనివర్సిటీ నుండి 10వ తరగతి హెవీ (HMV) డ్రైవింగ్ లైసెన్స్‌లు చదివి ఉండాలి. ఇంకా వివరాలు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా చూడవచ్చు.

జీతం :

ఎంపిక చేసిన అభ్యర్ధులకు రూ. 21700- 69100/- (స్థాయి- 3) వేతనం ఇవ్వబడుతుంది. ఇతర అలవెన్సులు అదనం .

వయోపరిమితి.. .

ఖాళీల కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థుల కనీస వయస్సు 2 1-27 సంవత్సరాల మధ్య. ఉండాలి.

  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాల వయస్సులో సడలింపు కల్పించారు.

దరఖాస్తు రుసుం ఎంతంటే?

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు..

ఎంపిక విధానం

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, డ్రైవింగ్ టెస్ట్ మరియు చివరి దశ మెడికల్ ఎగ్జామినేషన్. ల ద్వారా ఎంపిక చేయబడతారు.

ITBP Indo-Tibetan Border Police ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి?

అర్హత ఆసక్తి గల అభ్యర్ధులు క్రింద చెప్పబడిన లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దీనికోసం itbpolice.nic.in లోగానీ క్రింద తెలిపిన లింక్లో లేదా 26 జూలై 2023 తేదీలోగా అప్లికేషన్లు పంపవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 27 జూన్ 2023

దరఖాస్తుకు చివరి తేదీ: 26 జూలై 2023

ముఖ్యమైన లింకులు:

ITBP నోటిఫికేషన్ కొరకు క్లిక్ చేయండి

 

డ్రైవర్ కానిస్టేబుల్ లకు దరఖాస్తు చేసుకోడానికి క్లిక్ చేయండి

Leave a Comment