Breaking: పార్టీ మారే ప్రసక్తి లేదు : పిల్లి సుభాష్

తాను పార్టీ మారుతాను అన్న వదంతుల్లో నిజం లేదు అని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని చెప్పింది కేవలం అధిష్టానంపై ఒత్తిడి తేదానికే అని, పార్టీ ఆవిర్భావంలో తన పాత్ర కూడా ఉందని, ఈ పార్టీ తన స్వంత పార్టీ అని .. జనసేనలో చేరుతున్నాను అనే పుకార్లు నమ్మొద్దు అని ఆయన చెప్పారు.

రామచంద్రపురం సీటుపై జగన్ తనకు హామీ ఇచ్చారు అని, ప్రస్తుతం నియోజక వర్గంలో ఐపెక్ టీం సర్వే  జరుగుతుంది అని ఆ నివేదిక రాగానే జగన్ తగు నిర్ణయం తీసుకుంటారు అని పిల్లి చెప్పారు. ముఖ్యమంత్రిని దిక్కరించేలా మాట్లాడినందుకు తనను క్షమించాలని ఆయన జగన్ ను కోరారు.

Leave a Comment