దేవాస్ లోని బ్యాంక్ నోట్ ప్రెస్ జూనియర్ టెక్నీషియన్ మరియు సూపర్‌వైజర్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 111 జూనియర్ టెక్నీషియన్ మరియు సూపర్‌వైజర్ నియమాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 22.07.2023 నుంచి అమలులోకి వచ్చింది. 21.08.2023 దరఖాస్తులకు చివరితేదీ. అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు bnpdewas.spmcil.com చూడొచ్చు.
BNP దేవాస్ జూనియర్ టెక్నీషియన్ మరియు సూపర్‌వైజర్ ప్రకటన వివరాలు
సంస్థ పేరు | బ్యాంక్ నోట్ ప్రెస్, దేవాస్ (BNP దేవాస్) |
ఉద్యోగ ప్రదేశం | దేవాస్, మధ్యప్రదేశ్ లో |
ఉద్యోగాల వివరాలు | జూనియర్ టెక్నీషియన్ మరియు సూపర్‌వైజర్ |
ఖాళీల సంఖ్య | 111 |
ఉద్యోగ విభాగం | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ ద్వారా |
ఆఖరు తేదీ | 21.08.2023 |
అధికారిక వెబ్సైట్ | bnpdewas.spmcil.com |
ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు
క్ర. సం | పోస్టు | ఖాళీలు |
1 | సూపర్‌వైజర్ (ప్రింటింగ్) | 08 పోస్టులు |
2 | సూపర్‌వైజర్ (కంట్రోల్) | 03 పోస్టులు |
3 | సూపర్‌వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) | 01 పోస్టు |
4 | జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ | 04 పోస్టులు |
5 | జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్) | 27 పోస్టులు |
6 | జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్) | 25 పోస్టులు |
7 | జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ-అటెండెంట్ ఆపరేటర్/ ల్యాబొరేటరీ అసిస్టెంట్/ మెషినిస్ట్/ మెషినిస్ట్ గ్రైండర్/ ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) | 15 పోస్టులు |
8 | జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్/ ఎయిర్ కండిషనింగ్) | 03 పోస్టులు |
9 | జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) | 04 పోస్టులు |
10 | జూనియర్ టెక్నీషియన్ (సివిల్ / ఎన్విరాన్‌మెంట్) | 01 పోస్టు |
విద్యార్హత:
జూనియర్ టెక్నీషియన్ మరియు సూపర్‌వైజర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునేవారు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ / యూనివర్సిటీ నుండి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ చదివి ఉండాలి. ఇంకా వివరాలు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా చూడవచ్చు.
ఎంపిక విధానం
ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయబడతారు.
BNP Dewas ఉద్యోగాలకు ఎలా అప్లై చేసుకోవాలి?
అర్హత ఆసక్తి గల అభ్యర్ధులు క్రింద చెప్పబడిన లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. దీనికోసం bnpdewas.spmcil.com లోగానీ క్రింద తెలిపిన లింకులో గానీ 21.08.2023 తేదీలోగా అప్లికేషన్లు పంపవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 22.07.2023
దరఖాస్తుకు చివరి తేదీ: 21.08.2023
ముఖ్యమైన లింకులు:
BNP దేవాస్ నోటిఫికేషన్ కొరకు క్లిక్ చేయండి
జూనియర్ టెక్నీషియన్ మరియు సూపర్‌వైజర్‌లకు దరఖాస్తు చేసుకోడానికి క్లిక్ చేయండి