AP DME Jobs: 590 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DME AP Recruitment | Andhra Pradesh Notification 2023: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏపీ డీఎంఈ) అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసపత్రులు, వైద్య కళాశాలల్లోని వివిధ స్పెషాలిటీల్లో మొత్తం 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మెడికల్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ద‌ర‌ఖాస్తు ప్రక్రియ 15.07.2023 నుంచి ప్రారంభమవుతుంది. 26.07.2023 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులను Merit List, Interview ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు dme.ap.nic.in చూడొచ్చు.

DME AP అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రకటన వివరాలు

సంస్థ పేరు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (DME AP)
ఉద్యోగ ప్రదేశం ఆంధ్రప్రదేశ్ లో
ఉద్యోగాల వివరాలు సహాయ ఆచార్యులు
ఖాళీల సంఖ్య 590
ఉద్యోగ విభాగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు
దరఖాస్తు విధానం ఆన్‌లైన్ ద్వారా
ఆఖరు తేదీ 26.07.2023
అధికారిక వెబ్సైట్ dme.ap.nic.in

ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఇతర వివరాలు

విద్యార్హత:

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకునేవారు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ / యూనివర్సిటీ నుండి PG డిగ్రీ (MD/MS/DNB/DM/MD) చదివి ఉండాలి. ఇంకా వివరాలు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా చూడవచ్చు.

జీతం :

ఎంపిక చేసిన అభ్యర్ధులకు నిబంధనల ప్రకారం వేతనం ఇవ్వబడుతుంది. ఇతర అలవెన్సులు అదనం .

వయోప‌రిమితి

దరఖాస్తులను చేసుకునేవారి వయసు గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి . వయోపరిమితుల్లో సడలింపుల సమాచారం క్రింద ఇవ్వబడిన లింక్ లోని అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు

దరఖాస్తు/పరీక్ష ఫీజు:

అధికారిక నోటిఫికేషన్ చూడండి

ఎంపిక విధానం

మెరిట్ జాబితా, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు.

దరఖాస్తు ఇలా..

– ముందుగా అభ్యర్థులు dme.ap.nic.in పేజీని సందర్శించండి .

-ఇక్కడ “ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం ” కింద దరఖాస్తు లింక్పై క్లిక్ చేయండి.

-దరఖాస్తు అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకోండి.

-వివరాలను పూరించి.. రుసుము చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి.

-భవిష్యత్తు సూచన కోసం దరఖాస్తు ఫారమ్ ను ప్రింట్ తీసుకోండి.

నోటిఫికేషన్ కు సంబంధించి పీడీఎఫ్ ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోండి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేదీ: 15.07.2023

దరఖాస్తుకు చివరి తేదీ: 26.07.2023

ముఖ్యమైన లింకులు:

DME AP నోటిఫికేషన్ కొరకు క్లిక్ చేయండి

అసిస్టెంట్ ప్రొఫెసర్ లకు దరఖాస్తు చేసుకోడానికి క్లిక్ చేయండి

Leave a Comment