- పవన్ ఉపన్యాసాల్లో దూకుడుకి సహకారం
- కాపు వోట్లలో చీలిక రాకుండా వ్యూహాలు
- వైసిపి ఓటమే ఉమ్మడి లక్ష్యం
ఒకవైపు వివిధ పధకాలతో ముందుకి వెళుతున్న వైసిపి సర్కార్ ని ఎలాగైనా ఓడించాలని తెలుగుదేశం అద్యక్షుడు చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. జగన్ ని ముఖ్యమంత్రి పీఠం నుంచి గద్దె దింపేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పొత్తులు ఖరారు చేసుకుని సీట్ల పంపకం కూడా చేసుకున్నట్లు సమాచారం.
ఇది చదివారా: జనసేన-టిడిపి పొత్తు ఖరారు? 48 స్థానాల్లో పోటీకి పవన్ రడీ!
ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అని భావిస్తున్న బాబు కొన్ని విషయాల్లో పవన్ కి దిశా నిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ప్రచారం దూకుడుగా చెయ్యాలని, జగన్ పై, ఆయా ఎమ్మెల్యేలపై తీవ్రంగా విరుచుకు పడాలి అని సూచించిన బాబు దానికి తగ్గట్లు ఇప్పటికే తమ వద్ద ఉన్న అవినీతి సమాచారాన్ని అందించాలని తమ మీడియాను, నాయకులను కోరారట. ఈ మేరకు పవన్ వారాహి యాత్రలో ఇంతకూ ముందు ఎబిఎన్, ఈటీవీ లలో వచ్చిన వార్తలను, టిడిపి నాయకుల ఆరోపణలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు.
ఇకపోతే కాపు వోట్లలో చీలిక రాకుండా ఉండేందుకు కూడా చంద్రబాబు భారీ వ్యూహాన్నే రచించారు. పవన్ తన సభలలో ఎక్కడా టిడిపి ప్రస్తావన తేకుండా, ముఖ్యమంత్రి తానే అన్నట్లు ప్రచారం సాగించాలని, కాపులను పూర్తి స్థాయిలో చైతన్యపరచాలని సూచిస్తున్నారట!
ఇక వైసిపి దళిత వోటు బ్యాంకు కూడా కొల్లగొట్టేందుకు గతంలో జరిగిన వివిధ సంఘటనలను ఉదాహరించాలని, తాము ప్రచారంలో చెప్పలేని కొన్ని అంశాలను పవన్ ద్వారా గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోయేలా చేయడానికి ప్రయత్నిచాలని కోరినట్లు చెపుతున్నారు.
యువకులైన లోకేష్, పవన్ లు దూకుడుగా వెళ్లి తాను ఎక్కడా దూషణలు చెయ్యకుండా ప్రచారం సాగిస్తే తమ కూటమి గెలుపు నల్లెరుపై నడకలా సాగుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.
చూడాలి మరి ముందు ముందు వీరి ప్రచారం ఎలా కొత్తపుంతలు తొక్కనుందో!!