పవన్ పై పూనం కౌర్ ఫైర్: నకిలీ నాయకులను నమ్మొద్దు

ట్విట్టర్ వేదికగా ప్రముఖ నటి పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడ్డారు. ఏపీలో నకలీ నాయకులు తిరుగుతున్నారంటూ వారితో జాగ్రత్త అంటూ మహిళలను హెచ్చరించారు. ఈ సందర్భంగా పూనమ్ కౌర్- గతంలో వినేష్ ఫొగట్, సాక్షిమలిక్ చేపట్టిన ఆందోళనల గురించి ప్రస్తావించారు.

ఏపీలో మహిళలకు ఏదో జరిగిపోతోందంటూ గొంతు చించుకునే నాయకులు తయారయ్యారని పూనమ్ కౌర్ అన్నారు. వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహిళా సమస్యలపై పెద్దఎత్తున గొంతు చించుకునే వారు మహిళా రెజర్ల కోసం ఒక్క మాట కూడా మాట్లాడ లేదని గుర్తు చేశారు. తమకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని భావించినప్పుడే ఆ నకిలీ నాయకులు రోడ్ల మీదికి వస్తోన్నారంటూ పూనమ్ కౌర్ చెప్పారు. సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆందోళన చేసే నకిలీ నాయకుల పట్ల జాగ్రత్త వహించండి అంటూ ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ చురకలు జనసేన, తెలుగుదేశం పార్టీలకు తగిలినట్లుగా ఉన్నాయి. మరి వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి

Leave a Comment