టమాటా … అనగానే ఇష్టపడనివాళ్ళు ఎవరూ ఉండరు. ఉల్లి తర్వాత కూరల్లో ఎక్కువగా వాడేది టమాటానె అంటే అతిశయోక్తి కాదు.. అయితే ఆ టమాటా ధర ఇప్పుడు కొండెక్కి కూచుంద.
దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు టమాటాలు కొనడం అంటే భయపడుతున్నారు. ఒకప్పుడు ధరల పతనంతో రోడ్లపై పారబోసే టమాట ధర.. ఇప్పుడు చుక్కలను తాకుతోంది. హైదారాబాద్ల్ లో కిలో 120 రూపాయలు ధర పలుకుతుండగా, ఆంధ్రప్రదేశ్ లో పలు పట్టణాల్లో వంద దాటింది . రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి రైతుబజారులలో సబ్సిడీలో అందించడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
ఇకపోతే అసలు టమాట ధర ఎందుకు పెరిగిందంటే?
టమాటా సాధారణంగా వేసవికాలపు పంట. తగు వేడి ఉంటే టమాటా బాగా పండుతుంది. అయితే వేసవిలో అకాల వర్షాలు , వాతావరణ మార్పులతో టమాట పంట పూర్తిగా దెబ్బతింది. దీనితో దిగుబడి తగ్గి ఎగుమతులకు అంతరాయం ఏర్పడింది.
ఎంతకాలం ఈ ధరాఘాతం?
ఈ ధరలు ఇంకా పెరగొచ్చు అని మరో 20-30 రోజులు దాటితే కానీ మళ్ళీ పంట దిగుబడి వచ్చే అవకాసం లేదు అని నిపుణులు చెపుతున్నారు. అయితే మరో రెండు నెలలు ధరలు ఇలాగే ఉంటాయని క్రిసిల్ రీసెర్చ్ వెల్లడించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో పంట చేతికొచ్చి.. జనవరి నుంచి మార్కెట్లోకి వచ్చేదాకా ధరల్లో మార్పు ఉండబోదని తెలిపింది. ఒకసారి కొత్త పంట మార్కెట్లోకి రావడం మొదలైతే ధరలు 30శాతం వరకు తగ్గుతాయని పేర్కొంది.
ప్రస్తుతం వివిధ రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, బీహార్ , బంగ్లాదేశ్ ల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.
అలాగే గత నెలలో పెరిగిన ఉల్లి ధరలు 15 రోజుల్లో తగ్గుతాయి అని క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది.