కర్నూలు జిల్లా వికలాంగుల పునరావాస కేంద్రంలో ఉద్యోగాలు, చివరి తేది ఈనెల 30

జిల్లా కలెక్టరు/అధ్యక్షులు, రెడ్ క్రాస్ సొసైటి, కర్నూలు మరియు సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ, కర్నూలు వారి ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న జిల్లా వికలాంగుల పునరావాస కేద్రంలో గౌరవ వేతనము పై పని చేయుటకు వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి.

ఉద్యోగాల వివరాలు

పోస్టు పేరు మొత్తం ఖాళీల సంఖ్య
క్లినికల్ సైకాలజిస్ట్/ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ 1
సీనియర్ ఫిజియోథెరపిస్ట్/ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ 1
సీనియర్ ప్రోస్టెటిస్ట్/ ఆర్థోటిస్ట్ 1
ప్రోస్టెటిస్ట్/ ఆర్థోటిస్ట్ టెక్నీషియన్ 1
సీనియర్ స్పీచ్ థెరపిస్ట్/ఆడియాలజిస్ట్ 1
హియరింగ్ అసిస్టెంట్/ జూనియర్ స్పీచ్ థెరపిస్ట్ 1
మొబిలిటీ ఇన్‌స్ట్రక్టర్ 1
మల్టీపర్సర్ మొబిలిటీ రిహబిలిటేషన్ వర్కర్ 1
క్లర్క్, స్టోర్ కీపర్ 1
ప్యూన్, మెసెంజర్ 1
వొకేషనల్ కౌన్సెలర్, కంప్యూటర్ అసిస్టెంట్ 1
ఎర్లీ ఇంటర్వెన్షన్ థెరపిస్ట్ 1
ట్రాన్స్-డిసిప్లినరీ స్పెషల్ ఎడ్యుకేటర్ 2
Caregiver 1

విద్యార్హత

పోస్టును బట్టి 8వ తరగతి, పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ, B.Com, BMR, B.R.Sc, BRT, BPT, BOT, BPO, M.Phil, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా, MRW, M.R.Sc, పూర్తి చేసి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాల నుంచి M.Sc, PGDDT, PGDE డిగ్రీలను పొంది ఉండాలి.

ఎలా అప్లై చేసుకోవాలంటే !

ఈ ఉద్యోగాలకు సంబందించిన మరియు పూర్తి చేసిన బయోడేటా ఫారముతో పాటు తగిన విద్యార్హత ధృవీకరణ పత్రములతో మరియు అనుభవము గల సంబంధిత ధృవపత్రములను జిల్లా కలెక్టరు మరియు అధ్యక్షులు, రెడ్ క్రాస్ సొసైటీ, కర్నూలు వారి పేరు మీద తేది: 30-06-2023 పాయంత్రము 5.00 గం. లోగా సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ, కలెక్టరు కాంప్లెక్స్, కర్నూలు వారికి పోస్టు ద్వారా గాని స్వయంగా సమర్పించగలరు. ఇతర వివరములు www.kurnool.ap.gov.in వందు వుంచబడినది మరియు ఈ కార్యాలయపు దూరవాణి నెంబరు 08518-277864ను సంప్రదించగలరు.

Leave a Comment