,

తెలంగాణా కాంగ్రెస్ లో రెండు తెలుగు రాష్ట్రాలూ విడిపోయిన దగ్గర నుంచీ ఒకటే ప్రోగ్రాం.

తెలంగాణా కాంగ్రెస్ లో రెండు తెలుగు రాష్ట్రాలూ విడిపోయిన దగ్గర నుంచీ ఒకటే ప్రోగ్రాం. ఒకరిమీద ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం. రాష్ట్రము లో పార్టీ ఫలానా వాళ్ళ వల్లనే కుంటు పడుతోంది అనీ వారు లేకపోతే ఈ పాటికి అధికారం వచ్చేసేది అంటూ అధిష్టానం వారికి ఫిర్యాదులు చెయ్యడం. ఇదే పనిగా మారింది. పైగా ముఖ్యమంత్రి అభ్యర్ధి దగ్గరకి వచ్చే సరికి నేనంటే నేను అంటూ గొడవ గొడవ చేస్తుంటారు వారందరూ. ఇదే విష‌య‌మై ఎవ‌రిస్థాయిలో వారు ప్ర‌య‌త్నాలు కూడా చేస్తున్న‌ట్టు క‌థ‌నాలు వినిపించాయి.

ఆ మ‌ధ్య ఢిల్లీ వెళ్లొచ్చిన సీనియ‌ర్ నేత జానారెడ్డి, ప‌లువురు పార్టీ నేత‌ల తీరుపై సోనియా గాంధీకి ఫిర్యాదు చేసిన‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. జానా రెడ్డి పని తీరు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అంటూ ఫిర్యాదుల చిత్తాని కొందరు రాష్ట్ర నేతలు డిల్లీకి స్వయంగా వివరంగా రాసి పంపినట్టు మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యన కేంద్ర మాజీ మంత్రి ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ఉన్న టైం లో వెంకయ్య ని కలిసారు జానా.

దీంతో పాటు అనేక ఫిర్యాదుల సమ్మేళనం డిల్లీ కి చేరిందట. హైదరాబాద్ లో వెంకయ్య కి ఆత్మీయ సభ జరగడం స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో, యూపీయే త‌ర‌ఫున ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా గోపాల్ కృష్ణ గాంధీ బ‌రిలోకి దిగుతుంటే… ప్ర‌త్య‌ర్థి పార్టీ అభ్య‌ర్థి అభినందిస్తూ జానారెడ్డి మాట్లాడ‌టంపై రాష్ట్రనేత‌లు మండిప‌డ‌టం మొద‌లుపెట్టారు.గతం లో కూడా తెరాస ఐదు రూపాయల భోజనం ఐడియా ని మెచ్చుకున్నారు జానా.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Loading…

Comments

comments

Hard to miss the coveted status of Komik that declares